1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Preview

Ek Niranjan| Preview| Prabhas| Kangana Ranaut| Puri Jagannath| Bollywood | అక్టోబర్‌ 29న వస్తోన్న ప్రభాస్ "ఏక్‌నిరంజన్‌"

ఏక్నిరంజన్
WD
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జంటగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "ఏక్‌నిరంజన్".

ఆదిత్యరామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఆదిత్యరామ్‌ ఆదిత్యమూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా కోసం 35రోజులపాటు థాయ్‌లాండ్‌లో భారీ షెడ్యూల్‌ జరిగింది.

ఈ షెడ్యూల్‌ విశేషాల్ని దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ తెలియజేస్తూ.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌, పట్టాయాలలో చేసిన భారీ షెడ్యూల్‌లో ఈ చిత్రం క్లైమాక్స్‌ సన్నివేశాల్ని, కొన్ని కీలక సీన్స్‌ని చిత్రీకరించామన్నారు.

20 రోజులపాటు తీసిన క్లైమాక్స్‌ చిత్రీకరణలో మన ఇండియన్‌ ఫైటర్స్‌తో పాటు యూరప్‌ ఫైటర్స్‌ పాల్గొన్నారని నిర్మాత వెల్లడించారు. హాలీవుడ్‌ హీరో జాకీచాన్‌తో సోలో ఫైట్‌లో పాల్గొన్న ఫైటర్‌ కూడా ఇందులో పాల్గొనడం విశేషం. అత్యధిక వ్యయ ప్రయాసలతో కూడిన క్లైమాక్స్‌ "ఏక్‌నిరంజన్" చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని పూరి అన్నారు.

ఇకపోతే.. విదేశాల్లో షెడ్యూల్ ముగించుకుని రాగానే ఈ నెల 16 నుండి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను కొనసాగించామని డాషింగ్ డైరక్టర్ పూరి వెల్లడించారు. సెప్టెంబర్‌ 15 వరకు ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌లో రెండు పాటల్ని, కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో షూటింగ్‌ పూర్తవుతుందని ఆయన చెప్పారు.

సెప్టెంబర్‌లో ఆడియోను రిలీజ్‌చేసి అక్టోబర్‌ 29న చిత్రాన్ని విడుదల చేయనున్నామని పూరి తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌, దేశ్‌పాండే, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, పోసాని, సత్యప్రకాష్‌, అలీ, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్‌కె నాయుడు, సమర్పణ: పూరీ జగన్నాథ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీజగన్నాథ్‌.