Movie update | Quick Gun Murugan | Rajendra Prasad | Rambha | నట కిరీటి "క్విక్ గన్ మురుగన్"
WD
దర్శకత్వం: శశాంక్ ఘోష్
కళాకారులు : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వినయ్ పాఠక్, రణబీర్ శౌరీ, సంధ్యా మృదుల్, రంభ, అశ్విన్ ముశ్రాన్
క్విక్ గన్ మురుగన్ సౌత్ ఇండియన్ కౌబాయ్ చిత్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హీరో రాజేంద్ర ప్రసాద్ నిస్సహాయులకు సహాయం చేస్తూ, వారికి ఎల్లప్పుడు తోడు-నీడగా ఉంటాడు. తను చేసే ప్రతి పనిలోనూ ఓ స్టైల్ ఉంటుంది.
ఈ చిత్రం మిస్ ఎడ్వెంచర్స్ చిత్ర కథకు పోలికలున్నాయని చిత్ర విమర్శకులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా హీరోకు విలన్ ప్లేట్ రెడ్డి శత్రువు. నిత్యం ఇతనితో వాదులాడుతుంటాడు.
FILE
చిత్ర కథననుసరించి మురుగన్ దక్షిణ భారతదేశంలోని ఓ కుగ్రామంనుంచి జీవిత పోరాటం చేస్తూ స్వర్గానికి చేరుకుంటాడు. ఆ తర్వాత ముంబై మహానగరానికి చేరుకుంటాడు.
ఇతనంటే మ్యాంగో డాలీకి చాలా ఇష్టం కాని తనలోనున్న ప్రేమను అతనికి చెప్పలేక పోతుంది. మురుగన్ తొలి ప్రేమ లాకెట్ గర్ల్‌తోనన్నమాట.
ఇదిలావుండగా ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు, లగాన్, గజనీ సినిమాల హీరో అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని చూసాడు. ఈ చిత్రం గురించ తన బ్లాగులో ప్రశంసల జల్లు కురిపించాడు. చిత్రాన్ని చూసిన తర్వాత ప్రేక్షకులు మురుగన్‌ను ప్రశంసించకుండా ఉండలేరని, తాను రాజేంద్ర ప్రసాద్ నటనకు ముగ్దుడనైనానని బ్లాగ్‌లో పేర్కొన్నాడు.
