Maa nanna Chiranjeevi, Jagapathi Babu, Neelima, Athulith, September, Subhalagnam | సెప్టెంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"
WD
ఈ సందర్భంగా హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ కథ తనకు బాగా నచ్చిందన్నారు. "శుభలగ్నం"లా సెంటిమెంట్ ఉంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మిళితమైన కథ ఇదని తెలిపారు. ఓ పిల్లాడికి తనకు ఉండే అనుబంధం ఈ కథలో మెయిన్ పాయింట్ అని, మాస్టర్ అతులిత్ ఇందులో చక్కగా నటించాడని చెప్పారు. అలాగే హీరోయిన్ నీలిమ అద్భుతంగా నటించిందని, తన కెరీర్‌లో మరో మైలురాయిలా నిలుస్తుందని వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేనెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: కె. ధరన్, ఆర్ట్: కె.వి. రమణ.
