విశ్వంలోని ప్రతిదానిలో జీవం ఉన్నట్లయితే.. చెట్లు, ఆకుకూరలు, కాయగూరల్లోనూ జీవం ఉండబట్టే ఎదుగుదల ఉంటుంది. మరీ దాన్ని కోసి తింటుంటే అదికూడా మాంసాహారమేగా..? అని మాంసాహారులు ప్రశ్నింస్తుంటారు. ఏది ఏమైనా ఇదే నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ "క్విక్ గన్ మురుగన్" చిత్రం రాబోతోంది.
కథ పరంగా చెప్పాలంటే.. శాఖాహారులకు, మాంసాహారులకు జరిగే పోరాటమే ఈ సినిమా. జీవహింస చేయకూడదని ఓ వర్గం చెబితే.. మనుగడ కోసం చేసే పోరాటంలో ఇవన్నీ మామూలేనని మరోవర్గం సమర్థించుకుంటుంది. ఈ సమరంలో తాను ప్రాణాలు కోల్పోతాను. తర్వాత చిత్ర గుప్తుడిని మచ్చిక చేసుకుని మళ్లీ భూమికి వచ్చి ఏం చేశాను? అనేది ఈ చిత్ర కథ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కానీ ఇలాంటి కథలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని, దర్శకుడు శశాంక్ ఘోష్ ఈ కథ తయారుచేసుకుని ఇందులో హీరోగా ఎవరు బాగుంటారు? అనే సర్వే నిర్వహిస్తే ఎక్కువ శాతం ప్రజలు తన పేరు సూచించారట. అది విని చాలా సంతోషించానని రాజేంద్రప్రసాద్ అన్నారు. పైగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ఒప్పేసుకున్నానని తెలిపారు.
ఇందులో తాను కౌబాయ్‌గా నటించానని, "మైండ్ ఇట్" అనేది ఇందులో తన ఊతపదమని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అప్పుడప్పుడు నోటికొచ్చిన ఇంగ్లీషును మాట్లాడుతుంటానని.. అందులో కాస్త తమిళయాస కూడా ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమా డైలాగ్‌లతో రింగ్‌టోన్లు కూడా తయారు చేశారని చెప్పుకొచ్చారు.
ఇకపోతే సెక్సీతార రంభ క్విక్ గన్ మురుగన్‌లో నృత్యకారిణిగా నటించింది. ఈ చిత్రాన్ని చూసి అమీర్‌ఖాన్ కూడా మెచ్చుకున్నాడట. మరి ఈ చిత్రం ఇంకా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.