ప్రధాన పేజివినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » గాంధీ జయంతి నాడు వస్తోన్న "మహాత్మ" (Gandhi Jayanti| Mahatma| Cinema| Srikanth| Bhavana| Krishna Vamsi| Trailers)
శ్రీకాంత్ వందో చిత్రమైన "మహాత్మ"ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. సోమవారం రాత్రి ఫిలింఛాంబర్ క్లబ్‌లో మహాత్మ ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
నటుడు రవితేజ ట్రైలర్స్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ఈ నెల 2నే విడుదల చేయాల్సింది.. కానీ అప్పటికే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. అదృశ్యం కావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని కృష్ణవంశీ పేర్కొన్నారు.
ఇంకా చిత్రం గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ.. మహాత్మ అంటే ఎవరు? అనేది ఈనాటి తరానికి తెలియదు. ఇందిరాగాంధీ వారసుడేమోనని చాలామంది అపోహపడుతున్నారు.. అంటే నేటి స్థితి ఇలా ఉంటే భవిష్యత్‌లో గాంధీజీని మర్చిపోతారు.
కానీ విదేశీయులు మాత్రం మహాత్మాగాంధీ అంటేనే.. ఇప్పటికీ టక్కున చెప్పేస్తారు. ఆయనపై తొలి చిత్రం తీసింది కూడా ఆంగ్లేయులే. అందుకే.. నేటి రాజకీయనాయకులు ఓటు బ్యాంకుకోసం గాంధీని వాడుకోవడం గాకుండా ఆయనకోసం మనం ఏం చేస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలంటే ఈ సినిమాను చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 19వ తేదీన విడుదల చేస్తామని, ఆరోజు మరిన్ని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.
మహాత్మలో నటించినందుకు గర్వపడుతున్నా: శ్రీకాంత్ తనకిది వందో చిత్రం కంటే.. మహాత్ముని పేరుగల చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయని చెప్పారు. బెంగళూరుకు చెందిన జనతాదళ్ ఎం.పి. మనోహర్ ఈ చిత్రాన్ని స్నేహితునిగా తనపై ఉన్న నమ్మకంతో తీశారని, ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని శ్రీకాంత్ తెలిపారు.
మౌనమే నిజమైన హింస: పరుచూరి బ్రదర్స్ హింసంటే బాంబులు వేయడం కాదు. మౌనంగా ఉండడమే.. వైలెంట్‌గా ఉండే ఓ వ్యక్తి నాన్‌వైలెన్స్‌గా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథ. కృష్ణకు అల్లూరి సీతారామరాజులో శ్రీకాంత్ మహాత్మ ద్వారా సినీ చరిత్రలో నిలుస్తాడని పరుచూరి బ్రదర్స్ నమ్మకం వ్యక్తం చేశారు.