1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Sai Ram Shankar

Bumper Offer| Sai Ram Shankar| Puri Jagannath| Bindu Madhavi| Avakai Biryani | విజయదశమి కానుకగా "బంపర్ ఆఫర్"

బంపర్ ఆఫర్
WD
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, "ఆవకాయ్ బిర్యానీ" ఫేమ్ బింధు మాధవి హీరోయిన్‌గా నటిస్తోన్న "బంపర్ ఆఫర్" చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.

వైష్ణో అకాడమీ పతాకంపై పూరిజగన్నాథ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయరవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ఈ చిత్రానికి గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం ఆడియో "పూరి సంగీత్" ద్వారా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ గణేష్ మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో రెండు పాటలను చిత్రీకరించామన్నారు.

దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని.. విజయదశమి కానుకగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శంకర్ గణేష్ చెప్పారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: చిన్నా, కథ, మాటలు, నిర్మాత: పూరి జగన్నాథ్.
About Writer
SELVI.M