Cinema| Ek Niranjan| Prabhas| Kangana| Shooting| Puri Jagannath | అక్టోబర్ 29న తెరపైకి వస్తోన్న "ఏక్ నిరంజన్"
ప్రభాస్, కంగనాల "ఏక్‌నిరంజన్" షూటింగ్ పూర్తి
WD
ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెలలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను రెలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సినిమా చాలా వచ్చిందని, థాయ్‌లాండ్‌లో 20 రోజుల పాటు తీసిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో మన భారతీయ ఫైటర్స్‌తో పాటు యూరప్ ఫైటర్స్ కూడా పాల్గొన్నారని నిర్మాత వివరాలందించారు.
అలాగే హాలీవుడ్ హీరో జాకీచాన్‌తో సోలో ఫైట్‌లో పాల్గొన్న ఫైటర్ కూడా ఈ క్లైమాక్స్‌లో పాల్గొనడం విశేషం. అత్యధిక వ్యయప్రయాసలతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఏక్‌నిరంజన్‌కు హైలైట్ అవుతుందని ఆదిత్యారామ్ వెల్లడించారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఏక్‌నిరంజన్‌ని అద్భుతంగా మలిచారని నిర్మాత కితాబిచ్చారు.
ఇటు ప్రభాస్ కెరీర్‌లో, అటు పూరి కెరీర్‌లో ఏక్‌నిరంజన్ మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఆదిత్యారామ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తొలిసారిగా తెలుగులో హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, బ్రహ్మానందం, అలీలపై చేసిన కామెడీ ట్రాక్ సినిమాలో మరో హైలైట్ అవుతుందని ఆదిత్యారామ్ తెలియజేశారు.
యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, సోనూ సూద్, ముకుల్‌దేవ్, మకరన్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, ఫైట్స్: స్టన్ శివ, స్టిల్స్: రాజా, సమర్పణ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్, నిర్మాత: ఆదిత్యారామ్.
