Sarai Veerraju| Ajay| A Okkadu| October| Audio| Rajamouli | అక్టోబర్‌లో "సారాయివీర్రాజు"గా వస్తోన్న అజయ్
WD
ఆడియో వేడుక సందర్భంగా మగధీర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. సారాయి వీర్రాజు చిత్ర దర్శకుడు కణ్ణన్ తన వద్ద పనిచేశాడని, తన సొంత ఆడియోలా భావిస్తున్నానని చెప్పారు. విజువలైజేషన్ గల కణ్ణన్‌కు సంగీతపరంగానూ మంచి అభిరుచి ఉందని రాజమౌళి కితాబిచ్చారు. ఈ చిత్రానికి సాయి చక్కటి ట్యూన్స్ ఇచ్చాడని తెలిపారు.
చిత్ర నిర్మాత పి.ఆర్.కె రావు మాట్లాడుతూ.. నిర్మాతగా తన తొలి సినిమా అజయ్‌తో చేయడం ఆనందంగా ఉంది. ఇందులో అజయ్ కొత్తగా కన్పిస్తాడు. దర్శకత్వం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, వచ్చేనెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.
హీరో అజయ్ మాట్లాడుతూ.. చిన్న చిన్న పాత్రలు పోషించిన తాను హీరోగా ముద్రవేసుకోవడం థ్రిల్‌గా ఉందన్నారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
చిత్ర దర్శకుడు కణ్ణన్ మాట్లాడుతూ.. దర్శకుడిని ప్రోత్సహించే నిర్మాతలుంటే మంచి సినిమాలు వచ్చే అవకాశముందన్నారు. ఈ సినిమాకు యూనిట్ అంతా కష్టపడి పనిచేశారు. ఆ ఫలితం చిత్రం విజయం రూపంలో వస్తుందని కణ్ణన్ నమ్మకం వ్యక్తం చేశారు.
