1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Quick Gun Muragan

Rajendraprasad | Quick Gun Muragan | September 25 | Release | సెప్టెంబరు 25న "క్విక్ గన్ మురుగన్"

క్విక్ గన్ మురుగన్
WD
హిందీ, తమిళ భాషల్లో ఇప్పటికే విడుదలైన "క్విక్ గన్ మురుగన్" చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదలవుతున్నట్లు నటుడు రాజేంద్రప్రసాద్ బుధవారం వెల్లడించారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జాతీయస్థాయికి తగిన విధమైన క్యారెక్టర్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానన్నారు. సూపర్‌మేన్‌లా... సౌత్ ఇండియన్ సూపర్ హీరోలా ఈ చిత్రంలో తన పాత్ర ఉంటుందన్నారు. శాకాహారులు, మాంసాహారులకు మధ్య ఉండే ఘర్షణను ఈ చిత్రంలో బాగా చూపారనీ, చక్కని సందేశం కూడా ఉండటంతో తాను నటించడానికి అంగీకరించానని చెప్పారు.

దానికితోడు కమర్షియల్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయన్నారు. ఇందులో ఎమ్జీఆర్ చిత్రంలోని రెండు పాటలను రీమిక్స్‌గా ఉపయోగించామన్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. అమీర్ ఖాన్, అమితాబ్‌లు తమ బ్లాగుల్లో రాయడమే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

మీడియా కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 84 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT