1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Katha

Genelia| Katha| Cinema| Bommarillu| Arun| Prakash Raj| Shooting | విడుదలకు సిద్ధమవుతోన్న జెనీలియా "కథ"

జెనీలియా
WD
జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై "బొమ్మరిల్లు" ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్ర పోషిస్తోన్న తాజా చిత్రం "కథ". ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో జెనీలియా సరసన అరుణ్ హీరోగా పరిచయమవుతున్నాడు.

శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో, గుణ్ణం గంగరాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కనుంది. త్వరలో ఆడియోను విడుదలచేస్తామని చిత్ర నిర్మాత చెప్పారు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికైన ప్రకాష్ రాజ్, బాబు, షఫీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె. బాలచంద్రన్, ఆర్ట్: రవీందర్, కెమెరా: ఆండ్ర్యూ, మాటలు: గుణ్ణంగంగరాజు.
About Writer
SELVI.M