1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Animation film

Lavakusa | Animation film | Telugu | Hindi | English | తెలుగు, హిందీ, ఆంగ్లంలో యానిమేషన్ లవకుశ

కాణిపాకం క్రియేషన్స్
WD
ఆర్. ఛానెల్ ఆర్ వీఎంఎల్ బ్యానర్‌పై కాణిపాకం క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తోన్న యానిమేషన్ చిత్రం లవకుశ. రాయుడు వి. శశాంక్ నిర్మాత. యానిమేషన్ లవకుశ చిత్రం గురించి శశాంక్ మాట్లాడుతూ, "లవకుశ గాథ గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే 2-డి పరిజ్ఞానంతో ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాం.

ఈ చిత్ర నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం డబ్బింగ్, రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. నవంబర్‌లో ఆడియోను, డిసెంబరులో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఆంగ్లంలో యానిమేషన్ లవకుశ రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం దవళ సత్యం. సంగీతం: ఎల్ వైద్యనాథన్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT