1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Preview

Vidheyudu| Preview| Nandu| Rachana| Malhotra| Vinayakudu| Aa Naluguru | అక్టోబర్‌లో తెరపైకి రానున్న "విధేయుడు"

విధేయుడు
WD
ఆ నలుగురు, వినాయకుడు చిత్ర నిర్మాత సరితా పాట్రా తాజాగా నిర్మిస్తోన్న "విధేయుడు" చిత్రం ఆడియో దసరానాడు హైదరాబాద్‌లో విడుదలైంది.

నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తొలి ఆడియో క్యాసెట్‌ను ఆవిష్కరించి దర్శకుడు గుణశేఖర్‌కు అందజేశారు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోన్న విధేయుడు అక్టోబర్‌లో తెరపైకి రానున్నాడు.

ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. "విధేయుడు" చిత్రానికి దర్శకునిగా పరిచయం అవుతున్న ఎస్.ఎన్. మీరా తనవద్ద ఒక్కడు, అర్జున్ వంటి చిత్రాలకు పనిచేశాడన్నారు.

సినిమా తీయాలంటే కథపై కసరత్తుచేసి బాగా వచ్చేవరకు కష్టపడి పనిచేసేవాళ్లం. అలా మీరాకూడా కష్టపడేవాడు. యాపజయాలతో పనిలేకుండా అనుకున్నది వచ్చేటట్లుగా తెరపై చూపేవాళ్లం. మీరాకు విధేయుడు సక్సెస్ సంపాదించిపెడతాడని ఆశించారు.

చిత్ర సంగీత దర్శకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. పాటలన్నీ బాగున్నాయి. అందరికి గుర్తుంపు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని వచ్చేనెలలో విడుదల చేస్తున్నామన్నారు. నందు, రచనా, మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా ఆడియో మైత్రీ మ్యూజిక్ ద్వారా విడుదలైందని నిర్మాత చెప్పారు.
About Writer
SELVI.M