శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా నటించిన "మహాత్మ" చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు.
ఈ సినిమా లోగో ఆవిష్కరణలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న "మహాత్మ"ను విడుదల చేయాలనుకుంటున్నామని, కానీ ఇంకా ఖరారు కాలేదన్నారు.
నిర్మాత మనోహర్ మాట్లాడుతూ.. ఇటీవలే మహాత్మ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. కానీ సెన్సార్ కొన్ని కట్స్ చెప్పడంతో దాన్ని సరిచేయడం కాస్త టైమ్ పడుతుందని, అందుకే 9న ఈ సినిమాను విడుదలచేయనున్నట్లు వెల్లడించారు.
ఏది ఏమైనా శ్రీకాంత్ వందో చిత్రం సెన్సేషనల్ హిట్ చేయాలని కృష్ణవంశీ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇంకా ఈ చిత్రంలో మంత్ర, మనోరమ వంటి లేడిఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన ఛార్మి శ్రీకాంత్ సరసన ఓ పాటకు డ్యాన్స్ చేయనుంది. ఈ పాటలో ఛార్మి తన అందచందాలను ఆరబోస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.