1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Puri Jagannath

Bumper Offer| Puri Jagannath| Sai Ram Shankar| Bindu Madhavi| Avakai Biryani | సాయిరామ్ శంకర్‌కు పూరీ ఇచ్చే "బంపర్ ఆఫర్" ఇదే.!

అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "బంపర్ ఆఫర్"

బంపర్ ఆఫర్
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పూరి శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ చిత్రం ద్వారా పూరి మిత్రుడు, గాయకుడు రఘు కుంచెని సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

"పూరీ సంగీత్" పేరుతో పూరి జగన్నాథ్ ఆడియో సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా 'బంపర్ ఆఫర్' ఆడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ మాట్లాడుతూ.. మా బంపర్ ఆఫర్ ఆడియో సూపర్‌హిట్ అయ్యిందన్నారు. అన్ని ఏరియాలనుండి రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అక్టోబర్9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'బంపర్ ఆఫర్' అలరించి బంపర్ హిట్ అవుతుందని ఆశించారు.

హీరో సాయిరామ్ శంకర్ న్యూలుక్‌తో కనిపిస్తోన్న ఈ చిత్రంలో "ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ బిందు మాధవి హీరోయిన్‌గా నటిస్తోంది.

షాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, అలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాశ్‌రెడ్డి, సుప్రీత్, రక్ష, ఖయ్యూమ్, గుండు సుదర్శన్, శ్రావణ్, ఆనంద్, వంశీ, చిన్నా, కిరణ్మయి, చైతన్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: రఘుకుంచె, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, మేకప్: రవి, కాస్ట్యూమ్స్: సూర్య, పాటలు: భాస్కరపట్ల, డాన్స్: దినేష్, శోభి, ప్రొడక్షన్ కంట్రోలర్: సి. భాస్కర్ రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్ గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయరవీంద్ర, కథ-మాటలు-నిర్మాత: పూరి జగన్నాథ్.