1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Cinema

Padaharella Vayasu| Cinema| Bhushan| Arya Ohra| Censor| Romantic entertainer | సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "పదహారేళ్ల వయసు..!"

పదహారేళ్ల వయసు
ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడిని ఇతివృత్తంగా తీసుకుని రూపొందుతున్న చిత్రమే 'పదహారేళ్ల వయసు'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఎడిటింగ్ కార్యక్రమాల్లో ఉన్న పదహారేళ్ల వయసు సినిమాకు సెన్సార్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

భూషణ్, ఆర్య ఓరా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీసూర్య దర్శకుడు. డెరెక్టర్స్ మూవీ పతాకంపై కిలారి హరిప్రసాద్, యాడవల్లి నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన యూత్ ఎంటర్‌టైనర్ ఇదని నిర్మాతలు తెలిపారు.

యువతకు చక్కటి సందేశాన్ని అందిస్తూ అన్ని వాణిజ్యం అంశాలు మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం: రాజ్ కిరణ్, ఎడిటింగ్: భద్రి, కెమెరా: భాషాచంద్.
About Writer
SELVI.M