1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Samiksha

Visal| Samiksha| Surya| Sadaf| Nijamga nuvve gurtostunavu| Cinema | 9న ప్రేక్షకుల ముందుకు "నిజంగా నువ్వే గుర్తొస్తున్నావు"

నిజంగా నువ్వే గుర్తొస్తున్నావు
విశాల్, సమీక్ష జంటగా లక్ష్మీ అన్నపూర్ణేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం "నిజంగా నువ్వే గుర్తొస్తున్నావు". సి.హెచ్. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి మంజూర్ దర్శకుడు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఇదొక అపూర్వ ప్రేమకథా చిత్రమన్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం తపనపడే వారు కొందరైతే, ఆ అమ్మాయి ప్రేమ తనకే దక్కాలనుకునే ప్రేమరోగులు మరికొందరు. ఇటీవల కాలంలో ప్రేమకు సంబంధించిన అనేక సంఘటనలను చూస్తున్నాం. వింటున్నాం. ఈ సంఘటనలో ఒక విషయాన్ని తీసుకుని హాట్‌లవ్‌గా రూపొందిస్తోన్న చిత్రమిదని నిర్మాత వెల్లడించారు. థ్రిల్లింగ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.

సూర్య, సదాఫ్‌‌లు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంత్, పాటలు: రెహమాన్, ఎగ్టిక్యూటివ్ నిర్మాత: ఆలపాటి వెంకట భరత్.
About Writer
SELVI.M