1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. V.V. Vinayak

NTR| V.V. Vinayak| Cinema| Nayantara| Kodali Nani| Vaishnavi Arts| December | డిసెంబరులో వస్తోన్న ఎన్టీఆర్-నయనల చిత్రం!

ఎన్టీఆర్
నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ చివరి షెడ్యూల్‌ హైదరాబాదులో జరుగుతోంది.

కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. తారక్‌తో తాను చేస్తున్న మూడో చిత్రమిదన్నారు.

తారక్ ఇమేజ్‌కు తగినట్లుగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వి.వి.వినాయక్ తెలిపారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ ఫిలిమ్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

నిర్మాత వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ.. ఏకధాటిగా నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో మరో హ్యాట్రిక్ ఫిలిమ్ అవుతుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

సమర్పకులు కొడాలి నాని మాట్లాడుతూ.. తారక్, వినాయక్ కాంబినేషన్‌తో చాలా హైరేంజ్‌‌లో తీస్తున్న ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కనుందన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది ఓ లాండ్‌మార్క్ ఫిలిమ్ అవుతుందని చెప్పారు.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, షాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తనికెళ్ళ భరణి, రమాప్రభ, రాజ్యలక్ష్మి, సుధ, అనంత్, వత్సల రాజగోపాల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు, ఆర్ట్ డైరక్టర్: ఆనందసాయి, ఫైట్స్: స్టన్ శివ, రామ్-లక్ష్మణ్, పాటలు: చంద్రబోస్.

అలాగే.. డాన్స్: రాజు సుందరం, ప్రేమ్‌రక్షిత్, కళ్యాణ్, నోబుల్, ఎడిటింగ్: గౌతంరాజు, కో-డైరక్టర్: పుల్లారావు కొప్పినీడి, ఛీఫ్ కో-డైరక్టర్: తోట రామకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: జి.జి. కె.రాజు, ప్రొడక్షన్ మేనేజర్: చింతా రామకృష్ణ, సమర్పణ: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), నిర్మాత: వల్లభనేని వంశీమోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్.
About Writer
SELVI.M