1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Lady role

Actor Naresh | Lady role | Kartikamasam | Tanikella Bharani | మళ్లీ ఆడ వేషంలో నరేష్

నరేష్
WD
కార్తీకమాస ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పంచారామ క్షేత్రాల నేపధ్యంలో కార్తీకమాసం చిత్రం రూపొందింది. ఓ పక్క దైవభక్తికి సంబంధించిన అంశాలతోపాటు కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేయడం జరిగిందనీ, ఇందులో ఆరు పాటలున్నాయనీ నిర్మాత అనపర్తి శివరామకృష్ణ చెప్పారు.

నరేష్ లేడీ గెటప్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నటుడు తనికెళ్ల భరణి పాడిన "భాగ్యలక్ష్మీ రావే..." అనే పాట చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. చిత్ర సమర్పకుడు గనిశెట్టి రామయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి కార్తీకమాస పుణ్యకాలం ప్రారంభమవుతుందనీ, అందువల్ల అదే మాసంలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

స్వర్గీయ గెద్దాడ ఆనందబాబు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: జోగారావు, ఎడిటింగ్: నందమూరి హరి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT