గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » యూత్ ఓరియెంటెడ్ మూవీగా వస్తోన్న "జోరు" (Joru| Cinema| Aravind Kumar| Akarsha| Cinema Talkies| Youth oriented)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
అరవింద్ కుమార్, ఆకర్ష హీరోహీరోయిన్లుగా నూతన నిర్మాత ఎస్. మల్లేశం నిర్మించిన యూత్ ఓరియెంటెడ్ చిత్రం "జోరు". సినిమా టాకీస్ పతాకంపై నూతన నటీనటులు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ మరియు ఎడిటింగ్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం "జోరు" సినిమా డి.టి.ఎస్. మిక్సింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్. మల్లేశం మాట్లాడుతూ.. ఎమోషనల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో యువతకు చక్కటి సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల మూడోవారంలో విడుదల చేసి, సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

అరవింద్ కుమార్, ఆకర్ష, సాయికుమార్ (ప్రత్యేక పాత్ర), ఎల్.బి. శ్రీరామ్, వైజాగ్ ప్రసాద్, గుండుహనుమంతరావు, సుమన్‌శెట్టి, మేల్కోటే, అనిల్ ఫిష్ వెంకట్, గీతాంజలి, సన తదితరులు నటింటిన ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజ, సంగీతం: చక్రి, ఆర్ట్: నారాయణ, కొరియోగ్రఫీ: విద్య, శేఖర్, కెమెరా: వి. జయరాం, ఎడిటింగ్: నందమూరి హరి, సమర్పణ: లక్ష్మీ శ్రీమల్, నిర్మాత: ఎస్. మల్లేశం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సినిమా టాకీస్ టీమ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జోరు, అరవింద్ కుమార్, ఆకర్ష, సినిమా టాకీస్, యూత్ ఓరియెంటెడ్, సినిమా