1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Cinema

Bumper Offer Preview| Cinema| Puri Jagannath| Sai Ram Shankar| Bindu Madhavi| Avakai Biryani | 23న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న పూరి "బంపర్ ఆఫర్"

బంపర్ ఆఫర్
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం "బంపర్ ఆఫర్". సొంత పతాకం వైష్ణో అకాడమీపై శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో పూరీ నిర్మించిన "బంపర్ ఆఫర్" సినిమా ఈ నెల 23వ తేదీన తెరపైకి రానుంది. 

ఈ సినిమా గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, పూరి సోదరుడు శంకర్ గణేష్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23వ తేదీన బంపర్ ఆఫర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. సాయిరామ్‌శంకర్ ఈ చిత్రంలో న్యూ లుక్‌తో కనిపించడమే గాకుండా అద్భుతమైన నటనను ప్రదర్శించాడని చెప్పారు.

అలాగే "ఆవకాయ్ బిర్యానీ" ఫేం బిందుమాధవి ఇందులో హీరోయిన్‌గా నటించింది. సబ్జెక్టుతో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలిపారు.

పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అయిన ఆడియో పెద్ద హిట్ అయింది. అన్ని సెంటర్స్ నుంచి సినిమా రిలీజ్ అవకముందే ఆడియోకు రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని శంకర్ గణేష్ అన్నారు. రఘు కుంచె అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అయిందన్నారు.

వైష్ణో అకాడమీ బ్యానర్‌లో ఇంతకుముందు ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి లాంటి ఎన్నో హిట్స్ వచ్చాయి. ఈ బ్యానర్‌పై బంపర్ ఆఫర్ మరో బంపర్ హిట్ అవుతుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు.

షాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, అలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, రక్ష, ఖయ్యూమ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: రఘు కుంచె, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, మేకప్: రవి, కాస్ట్యూమ్స్: సూర్య, పాటలు: భాస్కర పట్ల, డాన్స్: దినేష్, శోభి, ప్రొడక్షన్ కంట్రోలర్: సి. భాస్కర్‌రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర గణేష్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జయరవీంద్ర, కథ, మాటలు, నిర్మాత: పూరి జగన్నాథ్.