Jayeebhava Cinema Preview| Kalyan Ram| Hansika| October | 23న కళ్యాణ్‌రామ్, హన్సికల "జయీభవ"
WD
అక్టోబర్ 23న జయీభవ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఇంతకుముందు నిర్మించిన అతనొక్కడే, హరేరామ్ చిత్రాల్ని ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాను కూడా ఆదరించి అఖండ విజయాన్ని అందిస్తారని నిర్మాత ఆశించారు. మొత్తానికి జయీభవ తమ బ్యానర్‌కి, కెరీర్‌కి చాలా మంచి సినిమా అవుతుందని చెప్పారు.
నందమూరి కళ్యాణ్‌రామ్, హన్సిక, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్‌ఖాన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: బి.ఎస్.రవి, సంగీతం: థమన్ ఎస్, ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: మాస్టర్ నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్ కొండేపాటి.
