1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Cinema

Yuvarajyam| Cinema| Preview| Audio| December| Songs | డిసెంబర్ రెండో తేదీన తెరకెక్కనున్న "యువరాజ్యం"

2వేల మంది యువతీయువకుల సమక్షంలో "యువరాజ్యం" ఆడియో

యువరాజ్యం
WD
వీరశంకర్ దర్శకత్వంలో బి.వి.ఎస్. శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్. నిర్మిస్తోన్న "యువరాజ్యం" చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్యాచ్‌వర్క్ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలకు ఆరుగురు సంగీతదర్శకులు పనిచేశారు. రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె. శివకాకాని, మురారి జయన్‌లు తమదైన శైలిలో సంగీతం సమకూర్చారు. అలాగే ఆరుగురు గీత రచయితలు సాహిత్యాన్ని అందించారని దర్శకుడు చెప్పారు.

ఈ సినిమా ఆడియోను విని టైమ్స్ గ్రూప్‌కు చెందిన "జంగ్లీ" ఆడియో సంస్థ విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నెల 22న ఆడియోను విడుదల చేస్తున్నామని వీరశంకర్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ రెండో తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.

కాగా, ఈ చిత్ర ఆడియోను 2వేల మంది యువతీయువకుల సమక్షంలో శిల్పకళావేదికలో వినూత్నంగా విడుదల చేయాలని సంకల్పించామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా ద్వారా వెంకట్, అరవింద్, రాజ్ కళ్యాణ్‌ వంటి కొత్తవారిని పరిచయం చేస్తున్నామని ఆయన అన్నారు.