Maa nanna Chiranjeevi Cinema, Preview| Jagapathi Babu| Neelima| Master Athulith| November | నవంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"
WD
ఈ చిత్ర విశేషాలను విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలియజేస్తూ.. చిన్నతనంలో పిల్లలకి తమ నాన్న అన్ని విషయాల్లో హీరోలా ఉండాలని ఫీలవుతారు. తండ్రిని రోల్‌మోడల్‌గా గుర్తిస్తుంటారు. ఆ పాయింట్‌ను బేస్‌చేసుకుని ఓ పిల్లవాడి కోణం నుంచి కథను తయారు చేశామన్నారు.
ఇది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అని, ఇందులో నీలిమ సూర్యకాంతంను పోలిన క్యారెక్టర్‌ను పోషిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి జగపతిబాబు చాలా సహకరించారని ఆయన అన్నారు.
హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. ఇది రెండు గంటల సినిమా. మళ్లీ అరుణ్‌ప్రసాద్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతా ప్లాన్‌ప్రకారం సినిమాను తీర్చిదిద్దారు.
ఆర్టిస్టుల పూర్తిసహకారంతో ఈ సినిమా పూర్తయిందని జగపతిబాబు అన్నారు. జీవితంలో బాగా పోరాడే పాత్రను పోషించానని తెలిపారు. సెకండాఫ్ పూర్తిగా ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని ఆయన వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: భరణి కె. ధరన్, సంగీతం: హేమచందర్, నిర్మాత: మురళీకృష్ణ.
