గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » నవంబర్ 19న వస్తోన్న 'జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా' (Jagathguru Sree Shirdi Sai Baba| Cinema| Preview| B.V. Reddy| Mohan babu| Naga Babu)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Jagathguru Sree Sai press Meet
WD
'జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా' చిత్రాన్ని నవంబర్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రముఖ నటుడు ఎం. మోహన్‌బాబు ప్రకటించారు. ఎస్.ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి టైటిల్ పాత్ర పోషించి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్‌బాబు మాట్లాడుతూ.. బి.వి.రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఆయనకు సినిమా పట్ల చక్కటి అభిరుచి ఉన్నదని చెప్పారు. ఈ సినిమాను బి.వి.రెడ్డి తనకు ముందే చూపించారని, షిర్డీ సాయిబాబా పాత్రకు ఆయన చక్కటి న్యాయం చేకూర్చారని అన్నారు.

ముఖ్యంగా చిత్రం రెండో భాగంలో ఆయన నటన చూస్తుంటే ఎప్పుడో ఈయన నటుడిగా మారాల్సిందని అనిపించిందని మోహన్‌బాబు తెలిపారు. ఇలాంటి భక్తిరస చిత్రాలకు విజయం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు.

టైటిల్ పాత్రధారి, నిర్మాత బి.వి.రెడ్డి మాట్లాడుతూ.. సాయిబాబా పాత్ర చేసేందుకు తనకు స్ఫూర్తి నిచ్చింది.. మోహన్‌బాబేనని చెప్పారు. సాయిబాబా కేవలం దైవస్వరూపం మాత్రమే కాదని, సంఘసంస్కర్త కూడానని ఆయన పేర్కొన్నారు.

నాటి సమాజంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకు ఆయన మానవ జన్మ తీసుకున్నారని నిర్మాత అన్నారు. హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఆయనెంతో కృషి చేశారని, సాయిబాబా జీవితంలో యధార్థ సంఘటనలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని మలిచామని బి.వి. రెడ్డి చెప్పారు.

దర్శకుడు గూడ రామకృష్ణ మాట్లాడుతూ.. తాము ఏదైతే చెప్పదలచుకున్నామో దానిని నటుడు, నిర్మాత బి.వి.రెడ్డి సహకారంతో నూటికి నూరుశాతం తెరపైన ఆవిష్కరించామని అన్నారు. సాయిబాబా పాత్రలో బి.వి.రెడ్డి నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పారు.

కాగా ఈ చిత్రంలో తాను తాత్యా పాత్రను పోషించినట్లు సత్యారెడ్డి తెలిపారు. గతంలో బి.వి.రెడ్డి కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ, ఆయన పూర్థిస్థాయి నటుడిగా చేసిన చిత్రమిదని అన్నారు.

ఇంకా చిత్రంలో సుమన్, నారాయణరావు, నాగబాబు, శివకృష్ణ, బ్రహ్మాజీ, రమాప్రభ, శివపార్వతి, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, గుండుహనుమంతరావు, జూ. రేలంగి, చిట్టిబాబు తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, పరిమి రామనర్సింహం, తైదల బాపు, సంగీతం: లలిత్ సురేష్, ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్: మేనఘ శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సి.హెచ్. ప్రభాకర్, సహ నిర్మాతలు: వి. భాస్కర్, టి. పార్వతి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా, సినిమా, ప్రివ్యూ, బివిరెడ్డి, మోహన్బాబు, సుమన్, నాగబాబు