గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » నవంబరులో తెరపైకి రానున్న కరిష్మా కొటక్ "గ్లామర్" (Glamour Cinema Preview| Karishma Kotak| Farah Khan| Bhuvaneswari| November)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD
గతంలో ప్రత్యూష, సర్ధార్ చిన్నపరెడ్డి, అయ్యప్పదీక్ష, రంగులకల, టి.నగర్ (తమిళ్) వంటి 15 చిత్రాలు నిర్మించిన నటుడు, దర్శక నిర్మాత పి. సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో "గ్లామర్" చిత్రం రూపుదిద్దుకుంటోంది. "శంకర్‌దాదా జిందాబాద్" ఫేమ్ కరిష్మాకొటక్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా కరిష్మా కొటక్ మాట్లాడుతూ.. శంకర్‌దాదా జిందాబాద్ విడుదలైన తర్వాత తెలుగు నిర్మాతల నుంచి అనేక ఆఫర్స్ వచ్చినా కథలు నచ్చక అంగీకరించలేదు. దర్శకనిర్మాత సత్యారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. సరైన అవగాహన లేకుండా సినీరంగంలో పైకి రావాలన్న తపనతో గ్లామర్ పరిశ్రమ గురించి రంగుల కలలు కని ఇక్కడికి వచ్చి మోసపోయే వారికి ఈ చిత్రం డిక్షనరీలా ఉపయోగపడుతుందని కొటక్ చెప్పింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో తనకు మరిన్ని చిత్రాల్లో అవకాశాలు లభిస్తాయనే నమ్మకముందన్నారు.

దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని నాగార్జునసాగర్, వైజాగ్, ముంబైలలో షూటింగ్ చేశామని చెప్పారు. ఈ రోజుతో షూటింగ్ పార్ట్ పూర్తయిందన్నారు. చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, చక్కటి సందేశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కామెడీకి పెద్దపీట వేశామని దర్శకనిర్మాత తెలిపారు.

తాను పడిన శ్రమక ఈ చిత్రం తగిన ఫలితాన్నిస్తుందని సత్యారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ మొదటివారంలో ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తామని చెప్పారు. నిర్మాణానంతర పనులను ఈ రోజునుంచే మొదలుపెట్టి, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు. కాగా చలనచిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్. రాజశేఖర రెడ్డికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో కరిష్మాకొటక్, ఫరాఖాన్, భువనేశ్వరి, తెలంగాణా శకుంతల, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, కొండవలస, కళ్లు చిదంబరం, కవిత, గుండు హనుమంతరావు, జెన్ని తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: బొంబాయిరవి, కెమెరా: శ్రీనివాస్, ఆర్ట్: రామకృష్ణా, నిర్వహణ: పి. సతీష్‌రెడ్డి, ఆర్. సూర్యప్రకాష్, సహనిర్మాతలు: తలశిల శ్రీనివాస్, డి. కిషోర్‌కుమార్, సమర్పణ: యస్. నర్శిరెడ్డి, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: పి. సత్యారెడ్డి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కరిష్మా కొటక్, గ్లామర్, సినిమా, ప్రివ్యూ, ఫరాఖాన్, భువనేశ్వరి, నవంబర్