1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Krishnudu

Village Vinayakudu | Krishnudu | Saranaya | Sai Kiran | డిసెంబరు 5న "విలేజ్ వినాయకుడు"

కృష్ణుడు
WD
కృష్ణుడు, సరనయ హీరోహీరోయిన్లుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహి నిర్మిస్తున్న విలేజ్ వినాయకుడు చిత్రాన్ని వచ్చే నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం మ్యూజిక్ టూర్లో ఉన్నామని తెలియజేస్తూ... బుధవారం నుంచి వైజాగ్‌లో బయలుదేరి తిరుపతి వరకూ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.

పాటలు విజయానికి సమిష్టి కృషి కారణంగా పేర్కొన్నారు. ఎటువంటి స్టార్ ఇమేజ్ లేకపోయనప్పటికీ 50 వేల సీడీలు అమ్ముడయి మరో లక్ష సీడీలు విడుదల చేయబోతుండటం విశేషమని తెలిపారు. చక్కటి కథాంశంతో ఆద్యంతం వినోదం కలిగించే ఈ చిత్రం తమ బ్యానర్లో విజయవంతమై చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకముందని మహి తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT