1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Nayanatara

NTR| Nayanatara| Sheela| V.V. Vinayak| Aadi| Action| Suspence| Narasimhachari | డిసెంబర్ 18న ఎన్టీఆర్-నయనల "అదుర్స్"..!

ఎన్టీఆర్
WD
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తూ.. వైష్ణవి ఆర్ట్స్‌పై రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో నయనతార, షీలాలు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్‌లో "ఆది" తర్వాత వస్తోన్న సినిమాలోనూ యాక్షన్, సస్పెన్స్ వంటి పలు అంశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రేక్షకులకు కొత్తగా కన్పిస్తాడని నిర్మాత డాక్టర్ వంశీ తెలిపారు.

పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎన్టీఆర్‌కి టర్నింగ్ పాయింట్. మంచి కథాబలం, కమర్షియల్ విలువల జోడింపుతో ఇంటిల్లపాది చూడదగ్గ చిత్రంగా ఉంటుందని వంశీ వెల్లడించారు.

కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. అయినా ఎక్కడా రాజీపడకుండా తీసిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సంచలనం సృష్టిస్తుందన్న నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు.

ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి అదుర్స్, నరసింహాచారి అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నెలలోనే ఆడియోను, డిసెంబర్ 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.

ఇకపోతే.. వినాయక్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తొలిసారిగా ఓ పూర్తిస్థాయి వినోదంతో కూడిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. యాక్షన్, కామెడీ, పాటలు, వినాయక్ టేకింగ్, ఎన్టీఆర్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వంశీ తెలిపారు.
About Writer
SELVI.M