1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Cinema

Padaharella Vayasu| Cinema| Preview| Bhushan| Arya Vora| November | నవంబర్ 13న తెరకెక్కనున్న "పదహారేళ్ల వయసు"

పదహారేళ్ల వయసు
డ్రీమ్‌గర్ల్, అలనాటి సినీతార శ్రీదేవి నటించిన 'పదహారేళ్ల వయసు' సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదే పేరుతో భూషణ్, ఆర్యా ఓరా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ మరియు సెన్సార్ సిగ్నల్ కోసం వేచి వున్న ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత హరి ప్రసాద్ తెలిపారు.

షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమాకు శ్రీ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. 16 ఏళ్ల అమ్మాయిలో కలిగే ఆలోచనలకు అద్దం పట్టే రీతిలో ఈ సినిమా ఉంటుందని నిర్మాత హరి ప్రసాద్ అన్నారు. ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్, వేణుమాధవ్, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్.
About Writer
SELVI.M