Manmadhulu, Cinema, Preview, Babilona, November | నవంబరులో రానున్న "మన్మధులు"
యువనిర్మాత వి. సురేష్ చౌదరి నిర్మించి తమిళంలో విజయవంతమైన "కాదల్ కదై" చిత్రాన్ని 'మన్మధులు' పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూర్యపవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై సూర్యడీజిల్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది.
అంతా కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న 'మన్మధులు' చిత్రం గురించి నిర్మాత వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ఒక కొత్త పాయింట్‌తో వచ్చిన ప్రేమకథా చిత్రమిదన్నారు. దీన్ని దర్శకుడు వేలురాజా ఎంతో శ్రమించి అన్ని తరగతుల వారికి నచ్చేలా అన్ని అంశాల్ని మేళవించి తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయన్నారు.
అతిరూపన్, ప్రీతిరంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రల్ని పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి రాజశేఖర రెడ్డి సంభాషణలను అందించారు.
ఇంకా ఈ చిత్రానికి గీత రచయిత: పోందూరి, ఎడిటింగ్: మధు సాంకేతిక వర్గం.
