గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » డిసెంబరులో వస్తోన్న సాయిరాంశంకర్ "వాడేకావాలి" (Vade kavali| Sairam Shankar| Suhasi| Bumper Offer| December| Dasavatharam| Surya s/o Krishnan)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Sairam, Suhasi
WD
'బంపర్ ఆఫర్' హీరో సాయిరామ్ శంకర్ నటించిన మరో యూత్‌ఫుల్ రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్ "వాడే కావాలి".

వీరేష్‌బాబు, రఘునాథ్ సోగి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి భారీ చిత్రాలు విడుదల చేసిన ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది.

ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సి.ఇ.ఓ శోభారాణి మాట్లాడుతూ.. వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతోన్న ఈ చిత్రం సాయిరాంశంకర్‌కి "బంపర్ ఆఫర్" తర్వాత చాలా మంచి చిత్రమవుతుందన్నారు.

ఇంకా ఈ సినిమా పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో సాయిరామ్ ఎనర్జీ అవుట్ స్టాండింగ్, మొత్తంగా అతని నటన హైలైట్‌గా నిలిస్తుందని శోభారాణి తెలిపారు. చక్కని కథ, కథనంతో హృదయాన్ని హత్తుకునే లవ్‌ఫీల్‌తో యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా "వాడే కావాలి" రూపొందిందని చెప్పారు.

ప్రముఖ మోడల్ హీరోయిన్ సుహాసి చాలా ఫ్రెష్‌లుక్‌తో చక్కని హావభావాలను ప్రదర్శించిందని నిర్మాత అన్నారు.

డైరక్టర్ రాజేందర్‌దర్శన్, ఖుషి, సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి, ఎవడైతే నాకేంటి, అందాల రాముడులాంటి హిట్ చిత్రాలకు కో-డైరక్టర్‌గా పనిచేశారు. ఆ చిత్రాలను రూపొందించిన అనుభవంతో 'వాడేకావాలి'ని అద్భుతంగా తెరకెక్కించారని శోభారాణి కితాబిచ్చారు. ఆర్.పి. పట్నాయక్ సంగీత సారథ్యంలో ఆరుపాటలు చక్కగా కుదిరాయని ఆమె చెప్పారు.

అత్యాధునిక సాంకేతిక విలువలతో మలేషియాలో చక్కని లొకేషన్స్‌లో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని డిసెంబర్ ప్రథమార్థంలో విడుదల కానుంది.

సాయిరామ్‌శంకర్, సుహాసి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, వేణుమాధవ్, అలీ, చంద్రవాస్, కోట శంకరరావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్‌వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమి, సంగీతం: ఆర్. పట్నాయక్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అభినవ శ్రీనివాస్: బాలాజీ మంగు, డాన్స్: నిక్సన్, గణేష్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, నిర్మాతలు: వీరేష్ బాబు, రఘునాథ్ సోగి, దర్శకత్వం: రాజేంద్రదర్శన్, సమర్పణ: ఎస్.వి.ఆర్. మీడియా ప్రైవేట్ లిమిటెడ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వాడేకావాలి, డిసెంబరు, సాయిరాంశంకర్, బంపర్ ఆఫర్, సుహాసి, దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్