Saleem | Audio release | Vishnuvardhan | Ileana | Mohan Babu | Dasari | రూ. 23 కోట్ల రూపాయలతో "సలీమ్"
WD
సలీం ఆడియో ఆవిష్కరణ బుధవారం రాత్రి శిల్పారామంలో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు చిత్రం గురించి మాట్లాడారు. "దర్శకుడు చౌదరి నా బిడ్డను బాగా చూపించాడు. బడ్జెట్ ఎక్కువయినా బాగా వచ్చింది. ఇందులో నేను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాను" అన్నారు.
ముఖ్య అతిథి దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. "మోహన్ బాబు తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి స్థాపించిన బ్యానర్లో 50 చిత్రాలు నిర్మించడం గొప్ప విషయం. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి సినిమాలు తీశాడు. సలీమ్ చిత్రానికి వస్తే చౌదరి, మోహన్ బాబువి వేరు వేరు పంథాలు. అయినా వారి కాంబినేషన్ అనగానే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంద"ని చెప్పారు.
వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ... "సినిమా ఆడియో అనేది ఓ మజిలీ. సందీప్ చౌతా చక్కటి సంగీతం అందించాడు. విడుదలకు ముందే ప్లాటినం డిస్క్ జరుపుకుంటుందనే నమ్మకముంది. సాహిత్యపరంగా చంద్రబోస్ అద్భుతమైన పదాలను సమకూర్చాడు. కథ చెప్పాలంటే... వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం.
నేను మా గురువు రాఘవేంద్రరావుగారు హీరోయిన్ పాత్రను ప్రేమిస్తాం. నాకు శ్రీదేవి, సిమ్రాన్ లంటే ఇష్టం.ఇప్పుడున్న వాళ్లలో ఇలియానా అంటే ఇష్టం. నా బొమ్మరిల్లు బ్యానర్లో మోహన్ బాబుతో కలిసి పనిచేయలేకపోయాను. అది ఈ రకంగా తీరింది. అది ఈ రకంగా తీరింది. సినిమాకు అందరూ పడిన కష్టం విజయంతో సమసిపోతుందనే నమ్మకముంద"ని తెలిపారు. ఈ ఆడియో సోనీ కంపెనీ ద్వారా విడుదలైంది.
