గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » సందేశాత్మకంగా తెరకెక్కనున్న "యుగళగీతం" (Yugalageetham| Cinema| Preview| AbhiShek| Srikar| SoniCharista| Sri Anjali| Deepti)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD
విద్యార్థిదశ ప్రతి ఒక్కరికి ఎంతో కీలకమైంది. జీవితగమ్యాన్ని నిర్దేశించే ఈ దశలో ఎంతో జాగ్రత్త అవసరం. చెడుమార్గంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తును బంగారుబాట చేసుకోవాలనే కథాంశంతో "యుగళగీతం" చిత్రం రూపొందుతోందని దర్శకుడు శివాజీ తెలిపారు.

ఇక టీనేజ్‌లో గాడితప్పిన విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగే విద్యార్థుల జీవితాల తారతమ్యాన్ని చూపిస్తూ.. ఈ చిత్రాన్ని జీవిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. అభిషేక్, శ్రీకర్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్ట, సబ్రినా, హాష్మి, శ్రీ అంజలి, దీప్తి ఇందులో ప్రధాన తారాగణం.

కవిత ఇంజేటి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణనంతర పనులు పూర్తికావడంతో తొలికాపీ సిద్ధమైంది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు శివాజీ ఇంకా మాట్లాడుతూ.. కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. చదువుకునే రోజుల్లో చదువే ముఖ్యం కావాలని చెప్పే సందేశాత్మక ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. కథ, పాత్రలు ఎలివేట్ కావాలనే ఉద్దేశంతో నూతనతారాగణంతో ఈ సినిమాను రూపొందించాం. వారంతా పాత్రోచితంగా అభినయించారు.

దాదాపు అందరికీ ఆర్టిస్టులుగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక సపోర్టింగ్ పాత్రల్లో సీనియర్ తారలను తీసుకోవడం జరిగింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామన్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు శివాజీ తెలిపారు. సహజంగా ప్రేమకథలకు నేపథ్యం చాలా ముఖ్యం. మా సినిమాలో ఎంపికచేసుకున్న నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో తొలి ప్రయత్నంలోనే వ్యయానికి వెనుకాడకుండా నిర్మాత ఎంతగానో సహకరించారని దర్శకుడు వెల్లడించారు.

చంద్రమోహన్, ఎం.ఎస్. నారాయణ, ఏవీఎస్, సూర్య, హర్షవర్ధన్, గుండు సుదర్శన్, కాశీ, కవిత, హేమ, అపూర్వ, దేవీశ్రీ, సుప్రియ, లక్ష్మీచంద్రిక, పూర్ణిమ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు : మరుదూరి రాజా, ఛాయాగ్రహణం: ఎ.యం. విజయ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : జి. శ్రీనివాస్, నిర్మాత: కవిత ఇంజేటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివాజీ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: యుగళగీతం, సినిమా, ప్రివ్యూ, అభిషేక్, శ్రీకర్, చందు, సోనిచరిష్ట, శ్రీ అంజలి, దీప్తి