గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » జనవరిలో నితిన్, హన్సికల "సీతారాముల కళ్యాణం" (Sita ramula kalyanam cinema| Preview| Nitin| Hansika| Shooting)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Hansika
WD
యూత్ హీరో నితిన్, సెక్సీడాళ్ హన్సిక జంటగా నటిస్తోన్న చిత్రం "సీతారాముల కళ్యాణం". ఈశ్వర్ దర్శకత్వంలో డా. విజయప్రసాద్ మల్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి "లంకలో" అనేది ఉపశీర్షిక. గత కొద్దిరోజులు నానక్‌రామ్‌గూడా విలేజ్‌లోని సెట్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత చిత్రం గురించి చెబుతూ.. "గతంలో నేను తీసిన "సిద్ధు ఫ్రమ్ శీకాకుళం" ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం అదే దర్శకుడితో మంచి కథను సినిమాగా తీస్తున్నాను. ఈ సినిమా టైటిల్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అనూప్ రూబెల్ సీనియర్ గాయనీగాయకులతో ఈ చిత్రంలో పాటలు పాడించారు. ఆడియోను వచ్చేనెల 19న విడుదల చేస్తున్నాం. జనవరి 8న సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. టైటిల్ కింద ఉండే లంకలో వల్ల సినిమా కొత్త లైఫ్ వచ్చింది. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు రోజుల ప్యాచ్‌వర్క్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. నేటితో (నవంబర్ 17వ తేదీ) అది కూడా పూర్తయిందన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. "రెండు పాటలను ఆస్ట్రియాలో చిత్రీకరించాం. ఈ సినిమాతో నితిన్ టాప్‌స్టార్ అవుతాడనే నమ్మకముంది. లంకలో కళ్యాణం ఎందుకు జరిగింది అనేదే ఈ చిత్రంలోని కీలక పాయింట్" అని చెప్పారు. "జయీభవ" సినిమా తర్వాత సీతారాముల కళ్యాణంలో నటించడం పట్ల అందాలతార హన్సిక ఆనందాన్ని వ్యక్తం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సీతారాముల కళ్యాణం, సినిమా, ప్రివ్యూ, నితిన్, హన్సిక, జనవరి, షూటింగ్