Maa Nanna Chiranjeevi| Jagapathi Babu| Nilima| Master Athulith| Cinema| Preview | డిసెంబర్ 25న "మా నాన్న చిరంజీవి"
WD
విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన గిరిధరరావు మాట్లాడుతూ.. 35రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందన్నారు. సినిమా చేయడం తెలుసుగానీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు. అందుచేత నట్టికుమార్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
నట్టికుమార్ మాట్లాడుతూ.. మొత్తానికి ఈ చిత్రాన్ని విశాఖటాకీస్‌పై విడుదల చేస్తున్నామన్నారు. జగపతి చిత్రాలంటే మామిచిగురు వంటి వినోదాత్మకంగా ఉంటాయని అందరికీ తెలుసు. అలాగే "మా నాన్న చిరంజీవి" కూడా మంచి కథాంశంతో రూపొందింది. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న 90 ప్రింట్లతో విడుదల చేస్తున్నామని చెప్పారు.
