1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Bumper Offer

Vade kavali| Bumper Offer| Sairam Shankar| Naresh| Venu Madhav| December | డిసెంబర్ 11న వస్తోన్న ''వాడే కావాలి''

వాడే కావాలి
WD
"బంపర్ ఆఫర్" వంటి హిట్ చిత్రంలో నటించిన సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం "వాడే కావాలి". ఎస్.వి.ఆర్. మీడియా సమర్పణలో సద్గురు సినిమా, వీరూ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో, రఘునాథ్ సోగి నిర్మించిన ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది.

ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్. మీడియా సీఈవో శోభ మాట్లాడుతూ.. సాయిరామ్ శంకర్ అద్భుతమైన నటన, ఆర్.పి.పట్నాయక్ సూపర్ మ్యూజిక్‌తో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే ప్రేమ కథాంశంతో "వాడేకావాలి' సినిమా రూపొందిందని చెప్పారు. బంపర్ ఆఫర్ తర్వాత సాయిరామ్ శంకర్‌కు ఇది మరో బంపర్ హిట్ అవుతుందని, డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

యస్.వి.ఆర్. మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వీరూ క్రియేషన్స్‌పై శ్రీ సద్గురు సినిమా అందిస్తున్న ఈ చిత్రంలో సాయిరాం శంకర్-సుహాసిలు జంటగా నటించగా, ఇతర పాత్రల్ని నరేష్, వేణుమాధవ్, అలీ, చంద్రహాస్, కోట శంకర్ రావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాసశర్మ, రవిప్రకాష్, అన్నపూర్ణమ్మ, రాజేశ్వరి, ప్రియ తదితరులు పోషించారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం, ఛాయాగ్రహణం: కళ్యాణ్ సమి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, రచన: టి. ప్రకాష్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: వీరేష్ బాబు, రఘునాథ్ సోగి, దర్శకత్వం: రాజేంద్రదర్శన్.