1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. డిసెంబర్ 11న వస్తోన్న ''సలీమ్''

SaleemI VishnuvardhanI IliyanaI Mohan BabuI Love StoryI YVS. Chowdary | డిసెంబర్ 11న వస్తోన్న ''సలీమ్''

సలీమ్
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మిస్తున్న "సలీం" చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మంచు విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ బిగ్ఎఫ్ఎం కలిసి నిర్మిస్తోంది. 

ఈ సందర్భంగా ఎగ్టిక్యూటివ్ నిర్మాత రావ్ శనివారం నాడు చిత్రం గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సలీమ్.. త్వరలో సెన్సార్‌ను కూడా పూర్తిచేసుకుంటాడని చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 11వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలియజేశారు.

అద్భుతమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో వైవిఎస్ చౌదరి అందెవేసిన చేయి అని, చిత్ర కథకు తగినవిధంగా "సలీమ్" అనే పేరు పెట్టారని రావ్ తెలిపారు. హీరో విష్ణు ఈ చిత్రం పాత్రకోసం చాలా తగ్గారని అది ఆయన కెరీర్‌కు ఉపయోగపడుతుందన్నారు. మోహన్‌బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆయన చెప్పే సందేశం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని రావ్ వెల్లడించారు.