Sarai Veerraju| Ajay| Viswa| Ramya| Cinema| Mass| Action Movie | 4న "సారాయి వీర్రాజు"గా వస్తోన్న అజయ్
WD
బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని దిల్‌రాజు వంటి కొందరు ప్రముఖులు చూసి ప్రశంసించారని తెలిపారు. ముఖ్యంగా ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితనం అద్భుతందా వచ్చింది. కణ్ణన్ సమర్థవంతంగా తెరకెక్కించారని నిర్మాత వెల్లడించారు.
హీరో అజయ్ మాట్లాడుతూ.. మాస్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు సహజంగా ఉండాలని ఓ గ్రామంలోని ప్రజలనే నటింపజేయడం ప్రత్యేకమని చెప్పారు. తన సినీ కెరీర్‌లో ఇది కొత్త చిత్రమవుతుందని, ఇందులో తాను విభిన్న పాత్రను పోషిస్తున్నట్లు అజయ్ అన్నారు.
