Akhri Anveshana| Cinema| Janki Shah| Mystery Sheikh| Murder Mystery | విడుదలకు సిద్ధమవుతోన్న "ఆఖరి అన్వేషణ"
"ప్రపంచ సుందరి జాంకీ షా హీరోయిన్‌గా వినోద్ చాప్రా దర్శకత్వంలో హిందీలో రూపొందిన "మిస్టరీ షక్" చిత్రాన్ని విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై "ఆఖరి అన్వేషణ" పేరుతో నిర్మాత టి. దుర్గారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నుతారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తుల నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుని బయటపడిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠ కలిగించే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది" అని నిర్మాత వెల్లడించారు.
రొమాంటిక్ మర్డర్ మిస్టరీగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలు ఇందులో వున్నాయని, సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలియజేశారు.
జాంకీ షా, ధనుంజయ్ చౌహాన్, ఆర్తిపురి, ప్రేమ్‌చోప్రా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు-పాటలు: పొందూరి, నిర్మాత: టి. దుర్గారావు, దర్శకత్వం: వినోద్ చోప్రా.
