Adurs | NTR | Nayantara | Shreya | Adi | Samba | V.V. Vinayak | సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్, నయనల "అదుర్స్"
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండో వారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ "అదుర్స్" అన్నారు. "సాంబ" తర్వాత తమ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో సూపర్ హిట్ అయ్యిందని, శ్రోతల నుంచి మంచి స్పందన వస్తుందని సమర్పకులు వెల్లడించారు. ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "అదుర్స్" చిత్రాన్ని జనవరి రెండో వారంలో సంక్రాంతికి కానుకగా విడుదల చేస్తామని ఆయన అన్నారు.
దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో ఆది, సాంబ చిత్రాల తర్వాత "అదుర్స్" హ్యాట్రిక్ ఫిలిమ్ అవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ తప్ప ఎవరూ "అదుర్స్"లోని రెండు పాత్రల్ని చెయ్యలేరు. ఎన్టీఆర్‌కు మాత్రమే సూట్ అయ్యే "అదుర్స్"లో ఆయన పెర్‌ఫార్మెన్స్ "అదుర్స్" అనిపించేలా ఉంటుందన్నారు. జనవరి రెండో వారంలో విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని వినాయక్ చెప్పారు.
నిర్మాత వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ.. ఒక మంచి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాని తమ పతాకంపై నిర్మించడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఈ సంక్రాంతిక్ పెద్ద ఘనవిజయం సాధించడానికి మా "అదుర్స్" ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.
