1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Sindhu Menon

Subhadra | Sindhu Menon | Cinema | January | Ashish vidyarthi | Suman | విడుదలకు సిద్ధమైన సింధు మీనన్ "సుభద్ర"

సుభద్ర
నూతన నిర్మాత శ్రీకాంత్‌గౌడ్, ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సుభద్ర". శ్రీకాంత్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి డీటీఎస్, మిక్సింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ గౌడ్ సినిమా గురించి చెబుతూ.. నవ్యతను కోరుకునే ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా అన్ని సంగతులు ఇందులో ఉన్నాయన్నారు. దర్శకుడు రాజావన్నెంరెడ్డి ఇంతవరకు తను తీర్దిదిద్దిన చిత్రాలకంటే దీనికోసం ఎంతగానో శ్రమించి యూత్ థ్రిల్లర్‌గా రూపొందించారని చెప్పారు.

కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, హీరోయిన్ సింధుమీనన్ అద్భుతమైన నటను ప్రదర్శించారని నిర్మాత వెల్లడించారు. అలాగే హీరో రవికిరణ్ బాగా చేశారని, కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని గౌడ్ నమ్మకం వ్యక్తం చేశారు. జనవరి మొదటివారంలోగా తొలికాపీని సిద్ధం చేసి, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక జనవరి మాసాంతానికి విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ.. "సుభద్ర"ను ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నిర్మాత పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. సంగీతదర్శకుడు చక్రి సినిమా మొత్తం రషెస్ చూసి తనను అభినందించినట్లు దర్శకుడు వెల్లడించారు.

22 రోజుల పాటు రీ-రికార్డింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, సుమన్, భానుచందర్, చలపతిరావు, రఘుబాబు, యం.ఎస్. నారాయణ, గౌతంరాజు, చిన్నా, అన్నపూర్ణ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎన్. సుధాకర్‌రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కళ: నాగేంద్ర, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్వహణ: శిరిగినేని శ్రీనివాసరావు (ఆలమూరు) పనిచేసిన సాంకేతిక వర్గం, సమర్పణ: బేబి హరిణి.