Venkatesh | Trisha | Srinu Vaitla | Malleswari | Nuvvu Naaku Nachav | Dhee | Ready | సంక్రాంతి కానుకగా వెంకీ, త్రిషల "నమో వెంకటేశ"!
విక్టరీ వెంకటేష్, హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్లల తొలి కాంబినేషన్‌లో వస్తోన్న "నమో వెంకటేశ" చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ చిత్రాల్లో అద్భుతమైన కామెడీ చేసిన విక్టరీ వెంకటేష్ వెంకీ, ఢీ, రెడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సూపర్ కామెడీ పండించిన హ్యాట్రిక్ డైరక్టర్, శ్రీనువైట్లతో కలిసి చేస్తున్న "నమో వెంకటేశ" చిత్రం వెంకీ, శ్రీనువైట్ల కెరీర్‌ల్లోను బంపర్ హిట్ అవుతుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి "నమో వెంకటేశ" విడుదలవుతున్న సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. "ఇంతకుముందు చేసిన చిత్రాల కంటే "నమో వెంకటేశ" చిత్రంలో చేసిన కామెడీ పీక్ లెవల్‌లో ఉంటుందన్నారు. శ్రీనువైట్లకు కామెడీలో మంచి నైపుణ్యం ఉంది. ఈ సబ్జెక్టులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు రొమాన్స్, యాక్షన్, సెంటిమెంటి వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి సీజన్‌కు ఇది పర్‌ఫెక్ట్ సినిమా అవుతుంది. ప్రొడ్యూసర్ రాము, గోపి, అనిల్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" తర్వాత త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని వెంకీ అన్నారు.
దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ.. "నాకెంతో ఇష్టమైన వెంకటేష్‌బాబుతో "నమో వెంకటేశ" చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి పండగకు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఓ విందు భోజనంలాంటి "నమో వెంకటేశ" చిత్రాన్ని అభిమానులకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా సోదరుల్లా పనిచేసిన నిర్మాతలు తొలి సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ అయ్యేలా శ్రమించారు. ఈ సంక్రాంతికి "నమో వెంకటేశ" విజయం మా యూనిట్ అందరికీ పెద్ద గిఫ్ట్ అవుతుందని భావిస్తున్నాం" అన్నారు.
వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, జె.పి., ఎం.ఎస్. నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముఖేష్ రుషి, సుబ్బరాజు, సత్యప్రకాష్, కాశీ విశ్వనాధ్, జీవా శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ: గోపిమోహన్, సహాయ రచయిత: శ్రీధర్ సీపన, మాటలు: చింతపల్లి రమణ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, మేకప్: రాఘవ, కాస్ట్యూమ్స్: శివ, స్టిల్స్: పాండ్యన్, ఆపరేటివ్ కెమెరామెన్: సూర్యతేజ, మేనేజర్స్: జి. వెంకటేశ్వరరావు, రాంబాబు, జె. మహేష్, దర్శకత్వ శాఖ: బి.వి.వి.ఎస్. చౌదరి, సురేష్ నడికొప్పుల, సుభాష్ జెట్టి, ఎ.రమేష్, కో-డైరక్టర్స్: సాయికిషోర్ మచ్చా, సూర్య, వరుణ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: బ్రహ్మానందం, కొరియోగ్రఫీ: శంకర్, కళ్యాణ్, శోభి, ఫైట్స్: విజయ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురెళ్ళ, సంగీతం: దేవీశ్రీప్రసాద్.
