1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Rajendra Prasad

Gudu Gudu Gunjam | Rajendra Prasad | Kasturi | Pardhu | Sitara | నెలాఖరున వస్తోన్న "గుడు గుడు గుంజం"

గుడు గుడు గుంజం
గుప్పెట్లో నిజం దాచి "గుడు గుడు గుంజం" ఆడటమే సంసారం అనే ఫ్యామిలీ బేస్డ్ ఎంటర్‌టైనర్‌గా సోమ విజయ ప్రకాష్ సమర్పించే ఈ సినిమా ఈ నెలాఖరున విడుదల కానుంది. మూడో వారంలో సినిమాను, జనవరి పదో తేదీన ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో డా. రాజేంద్రప్రసాద్, కస్తూరి, సితార, మిడిల్ ఏజ్ జంటగా నటిస్తున్నారు. పార్థు (నవదీప్ బ్రదర్), చాహత్ ఖన్నా, ఫరాఖాన్, రిథిమ, ఆర్తిపూరిలు యువ జంటగా నటించగా, బ్రహ్మానందం బ్యాంకాక్ కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు.

లేడిస్ టైలర్, ఏప్రిల్-1 విడుదల తర్వాత రాజేంద్రప్రసాద్ నటించిన ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో సితారతో చేసిన "ప్రేమించవా-మళ్లీ పెళ్ళాడవా" అనే టీజింగ్ పాట, కస్తూరితో చేసిన నిన్నిలా ఎప్పుడూ.. అని ఇనిస్పిరేషన్ పాట మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయన్నారు.

ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో బిజినెస్ ఆడియో రిలీజుకంటే ముందు బిజినెస్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో డిస్ట్రిబ్యూటర్స్‌కి సోమావిజయప్రకాష్ కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు ఇంత శుభపరిణామం జరగలేదని, ఇంతగొప్ప అదృష్టాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా రిలీజుకు అత్యంత భారీగా పబ్లిసిటీ చేస్తూ.. సినిమా టిక్కెట్లపై గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేశామని తెలిపారు.
About Writer
SELVI.M