1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Junior NTR

Adurs | Junior NTR | Nayanatara | Sheela | సంక్రాంతి కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్"

అదుర్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అదుర్స్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. 

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కొడాలి నాని మాట్లాడుతూ... ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ అదుర్స్, సాంబ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అన్నారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో ఆది, సాంబ చిత్రాల తర్వాత అదుర్స్ హ్యాట్రిక్ ఫిలిమ్ అవుతుంది. ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బిగ్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు.

నయనతార, షీలా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, షాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: వల్లభనేని వంశీమోహన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT