సూర్య సోదరుడు "యుగానికి ఒక్కడు" పాటలు విడుదల
WD
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడి అభిమానిని నేను. సినిమా ట్రైలర్స్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత కలుగుతోంది. కార్తీ ఒక సినిమా చేశాడు. ఆ సినిమాతోనే చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. భవిష్యత్‌లో రజనీకాంత్ అంత నటుడు అవుతాడు అని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ... మగధీర సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతుండగా అక్కడే ఈ సినిమా షూటింగ్ తీశారని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి అడ్వంచర్ చిత్రాలు రాలేదు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని చెప్పారు. చిత్ర సమర్పకుడు ఆర్ రవీంద్రన్ మాట్లాడుతూ... ఈ సినిమాను దర్శకుడితో సహా ఎంతోమంది కష్టపడి పనిచేశారు. కథరీత్యా రాత్రి వేళల్లో టెక్నీషియన్స్ పనిచేయాల్సి వచ్చింది. వారి శ్రమఫలితం ఈ చిత్ర విజయంతో చేకూరుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
సంగీత దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ... తెలుగులో మూడు సినిమాలు చేశాను. ఆ సినిమాలను విజయవంతం చేసినట్లే ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే ఆశిస్తున్నాను అన్నారు. కార్తి మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి సినిమా. మూడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి పెద్ద బడ్జెట్‌తో రూపొందించిన సినిమాలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు అన్నయ్య సూర్యను ఆదరించినట్లే నన్ను కూడా ఆదరిస్తారనే ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ... హైదరాబాద్ వస్తే సొంత ఇంటికి వచ్చినంత ఫీల్ కలుగుతుంది. చాలా రిస్క్ తీసుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాను రూపొందించాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్ముతున్నాను అన్నారు.

