1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Deepika Padukune

Upendra | Deepika Padukune | Kantri Mogudu | Aishwarya | మార్చిలో ఉపేంద్ర, దీపికా పడుకునేల "కంత్రీ మొగుడు"

ఉపేంద్ర
ఉపేంద్ర కన్నడంలో నటించిన "ఐశ్వర్య" చిత్రాన్ని తెలుగులో "కంత్రీ మొగుడు"గా అనువదిస్తున్నారు. ఇంద్రజిత్ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ ఉమామహేశ్వర ఫిలింస్‌పై రూపకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ కథానాయిక దీపికా పడుకునే హీరోయిన్‌గా నటించింది.

శరవణా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది. భారతీబాబు ఐదు పాటలు రచించగా, కుంచెరఘు, రవివర్మ, శ్రీలేఖలు ఈ పాటలను ఆలపించారు. క్లాస్‌, మాస్‌ను ఆకట్టుకునే చిత్రమిదని, కన్నడం తరహాలా తెలుగులో మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాత రూపకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఎ" ఉపేంద్ర తరహాలోనే "కంత్రీ మొగుడు" ఉంటుందని చిత్ర సమర్పకుడు డి. గోపాలకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో తాను మన్మదుడా.. మన్మథుడా" అనే పాటాను పాడానని శ్రీలేఖ చెప్పారు. ఈ నెలాఖరులోగానీ, వచ్చేనెలలోగానీ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.