AVS | Kotimooka | Krishnudu | Srddha Arya | ఏవీఎస్ దర్శకత్వంలో కృష్ణుడి "కోతీమూక"
హాస్య నటుడు ఏవీఎస్ దర్శకత్వం వహిస్తున్న నాల్గవ చిత్రం కోతిమూక. తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్. కె మోహన్ కుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభమైంది.
హీరో కృష్ణుడు, హీరోయిన్ శ్రద్ధ ఆర్యపై ముహూర్తపు షాట్ తీశారు. రామానాయుడు క్లాప్ కొట్టగా, సి. కల్యాణ్ కెమేరా స్విచాన్ చేశారు. మురళీ మోహన్ దర్శకత్వం వహించారు.
అనంతరం విలేకరులతో ఏవీఎస్ మాట్లాడుతూ... "ఇంతకుముందు చూసిన సినిమాలు బాగానే ఉన్నా కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఆ లోటును కోతిమూక తీర్చుతుందనే నమ్మకం నాకుంది. నేను దర్శకత్వం వహించిన రూమ్‌మేట్స్ చూసి నిర్మాత వెంకట్ జగదీష్‌గారు నాపై ఎంతో నమ్మకం పెంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను.
ఈ చిత్రంలో కృష్ణుడితోపాటు బ్రహ్మానందం, అలీ, ఎంఎస్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఏవీఎస్
