1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Lawrence

Super Cowboy | Lawrence | Padmapriya | Sandhya | Lakshmi Roy | మార్చిలో "సూపర్‌కౌబాయ్"గా వస్తోన్న లారెన్స్!

సూపర్కౌబాయ్
WD
మాస్, డాన్ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు "స్టైల్" వంటి సూపర్‌హిట్ చిత్రం హీరో, డైరక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ చిత్రం "సూపర్‌కౌబాయ్". ఈ చిత్రాన్ని ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కల్పాతి ఎస్. అగోరమ్ సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం గురించి హీరో రాఘవలారెన్స్ మాట్లాడుతూ.. "సూపర్‌కౌబాయ్" చిత్రాన్ని లావిష్‌గా ఎ.జి.ఎస్ సంస్థ నిర్మిస్తోంది. శింబుదేవన్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఈ కౌబాయ్ చిత్రంలో యాక్షన్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. రేర్ లొకేషన్స్‌లో తీసిన "సూపర్‌కౌబాయ్" హీరోగా నాకు సూపర్ డూపర్ హిట్ చిత్రం అవుతుంది" అన్నారు.

దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ.. "18వ శతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ ఎడ్వంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మాస్ ఆడియన్స్‌తో పాటు మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇష్టపడేవిధంగా ఈ సినిమా ఉంటుంది. రెడ్ ఇండియన్స్ గురించి ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా అద్భుతంగా చిత్రీకరిస్తున్నాం.
WD


ఇందుకోసం హాలీవుడ్ స్టైల్‌లో కేరళలో 300 మంది వర్కర్స్‌తో రాత్రింబవళ్లు పనిచేయించి అద్భుతమైన సెట్‌వేశాం. ఇండియన్ ఫిలిమ్ హిస్టరిలోనే ఇదో భారీ సెట్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని తెన్‌కాశి, తడ, మధ్యప్రదేశ్, రాయచోటి, సాతనూర్, బెంగళూరు, పూణె, నాగపూర్, పాల్ఘాట్, అంబసముద్రం, పాండిచ్చేరిలలో షూట్ చేశాం. శిథిలావస్థలో వున్న విజయనగర సామ్రాజ్యపు కందికోటలోని కంది కెనాల్‌లో తొలిసారి షూట్ చేసిన చిత్రమిది.

కంది కెనాల్‌లో రోజూ 20 కిలోమీటర్ల బోట్ ద్వారా ప్రయాణించి వెళ్లి షూటింగ్ చేశాం. 30 అడుగుల లోతులో వున్న ఈ నదిలో చాలా రిస్క్ షాట్స్‌ని చిత్రీకరించాం. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌబాయ్ చిత్రాల్లోనే ఓ సెన్సేషనల్ మూవీగా "సూపర్‌కౌబాయ్"ని ఎక్కడా రాజీ పడకుండా తీస్తున్నాం" అన్నారు.

నిర్మాత కల్పాతి ఎస్. అగోరం మాట్లాడుతూ... మంచి అభిరుచి వున్న తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మార్చిలో "సూపర్‌కౌబాయ్" చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తెలుగులో ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పద్మప్రియ, లక్ష్మీరాయ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాయికుమార్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సంధ్య, నాజర్, మనోరమ, సెంథిల్, మౌళి, ఢిల్లీగణేష్, రమేష్‌ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: వనమాలి, సంగీతం: జి.వి.ప్రకాష్, కళ: టి.ముత్తురాజ్.

ఇంకా ఎడిటింగ్: రాజామహ్మద్, ఫైట్స్: గ్రేట్ సెల్వ, డాన్స్: లారెన్స్, శివశంకర్, శ్రీధర్, ఆడియోగ్రఫీ: లక్ష్మీనారాయణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాలి, సమర్పణ: కల్పాతి ఎస్. అగోరం, నిర్మాతలు: కల్పాతి ఎస్. అగోరం, కల్పాతి ఎస్. రమేష్, కల్పాతి ఎస్. గణేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శింబుదేవన్.
About Writer
SELVI.M