Varudu | Allu Arjun | Gunasekhar | Audio | "వరుడు" విడుదల రోజునే "వధువు" తెలుస్తుంది
WD
ఈ కథకి హీరోయిన్‌ని అలా రివీల్ చెయ్యకపోవడమే కరెక్ట్ అని ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటారు. ఆడియెన్స్‌లో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతోపాటు ఈ కథకు కంపల్సరీగా అవసరం అయ్యే వరుడు హీరోయిన్ స్టిల్స్ గానీ, పేరును కానీ ఇంతవరకూ పబ్లిసిటీలో ఉపయోగించలేదు.
ఐతే కొన్ని వెబ్‌సైట్స్‌లో, ఛానల్స్‌లో వరుడు హీరోయిన్ పేరు ఉమా నెహ్రా అని సోహన్ సింగ్ అని, ఆంధ్రా అమ్మాయి సింధూర అని ఇలా రకరకాలుగా రాస్తున్నారు. ఫోటోలు పెడుతున్నారు. నిజానికి వరుడు హీరోయిన్ గురించి వస్తోన్న వార్తలుగానీ, ఫోటోలు గానీ ఎవరికివారు ఊహిస్తున్న ఊహాగానాలే తప్ప వాస్తవాలు కాదు. వరుడులో హీరోయిన్ ఎవరన్నది సినిమా విడుదల రోజే తెలుస్తుంది.
మీడియా మిత్రులందరూ ఈ విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. వరుడు సినిమా విడుదల రోజునే వరుడు హీరోయిన్ ఫోటోలను, పేరును రివీల్ చేయడం జరుగుతుంది" అన్నారు. వరుడు ఆడియో సూపర్ హిట్ చేసిన శ్రోతలకు గుణశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో ఆర్య పోటీపడి నటించిన వరుడు చిత్రం మార్చి 26న విడుదలవుతుంది.
