1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. సెల్- హ్యాండీకామ్‌లలో న్యూడ్ సెక్స్ సినిమా

Love, Sex Aur Dhokha, Cine Preview, Balaji Tele films, Ekta Kapoor, | సెల్- హ్యాండీకామ్‌లలో న్యూడ్ సెక్స్ సినిమా

లవ్
అవును ఇవ్వాళ ఎక్కడ చూసినా వ్యక్తిగత జీవితం బట్టబయలవుతోంది. నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమాన్ని ఐ కెమేరాల్లో బంధించి క్యాష్ చేసుకోవడం ఎక్కువై పోయింది. ఇటువంటి సంఘటనల నేపధ్యం చేసుకుని డేరింగ్ లేడీ ఏక్తా కపూర్ "లవ్, సెక్స్ ఔర్ ధోకా" చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు.

మార్చి 19వ తేదీన వెండితెరపై ఈ సినిమా వేడి రగిల్చనుంది. ఈ చిత్రంలో ప్రేమ... సాన్నిహత్యం... స్నేహం ప్రతిబింబిస్తాయి. అంతేకాదు ఇరువురు ఇష్టపడి సెక్స్ చేసుకునేటపుడు కొందరు ఆ కార్యక్రమాన్ని దొంగతనంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారన్న దానిపైనా సినిమా సాగుతుందని బాలీవుడ్ సినీవర్గాలు అంటున్నాయి.

అన్నిటికీ మించి మారుతున్న జీవన శైలిలో స్త్రీపురుషుల మధ్య సెక్స్ సంబంధాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సంబంధాలను కొందరు హ్యాండీకామ్స్, ఐ కెమేరాలు, సీసీటీవీలు, మొబైల్ కెమేరాలలో బంధించి మానసిక కామవాంఛలను తీర్చుకుంటున్నారు.

కొందరైతే... ఆ అవసరం తీరాక సదరు భాగస్వామికి "హ్యాండ్" ఇవ్వడమే కాక, వారి వద్ద చిక్కి ఉన్న సీసీ కేమేరాల రహస్యాన్ని విప్పుతామని బెదిరించడం మామూలు అయిపోయింది. ఇటువంటి వాటిని ఎలా ఎదుర్కొని నిలబడాలన్న దానిపై చిత్రం సాగుతుందని బాలీవుడ్ సినీ జనం అంటున్నారు.

బాలాజీ టెలీఫిలిమ్స్ లిమిటెడ్ బ్యానర్‌పై బాలజీ మోషన్ పిక్చర్స్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్, శోభా కపూర్, ప్రియా శ్రీధరన్ నిర్మిస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT