Marocharitra | Varun Sandesh | Anita | Dil Raju | K. Balachander | 25న వస్తోన్న వరుణ్‌సందేశ్ "మరోచరిత్ర"
వరుణ్‌సందేశ్, అనిత జంటగా దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మరోచరిత్ర". మ్యాట్నీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌పై దిల్‌రాజు తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరామెన్ రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రముఖ తమిళ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన అలనాటి 'మరోచరిత్ర' చిత్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దామని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా డీటీఎస్ వర్క్ జరుపుకుంటోందని ఆయన చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఇంకా కర్ణాటక, ఓవర్‌సీస్‌లలో ఈ సినిమాను విడుదల కానుందని చెప్పారు.
చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మరోచరిత్ర.కామ్‌ను దిల్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. అందరూ సినిమా సక్సెస్ అయ్యాక విజయయాత్రకు వెళ్తే.. తాము రిలీజ్‌కు ముందుగానే యాత్రను సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రం విమర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు.
